భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని చిన్న ముప్పారం గ్రామంలో వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదవ సెంటర్ వద్ద గ్రామస్తులచే విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వర స్వామిని అందంగా అలంకరించి నిమజ్జనానికి తరలించారు.
భక్తి పాటలు, సంకీర్తనలతో ఆధ్యాత్మిక సందడి
గ్రామంలోని భగవత్ భక్తులైన మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, సంకీర్తనలు, భక్తి పాటలు ఆలపించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు విఘ్నేశ్వరుని నామస్మరణ చేస్తూ ‘గణపతి…






