భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, సెప్టెంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక అప్‌డేట్

ఇందిరమ్మ ఇండ్లు 750 చ.అడుగులు మించొద్దు                     ఎంపీడీవో సింగారపు కుమార్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇందిరమ్మ ఇండ్ల స్లాబ్ నిర్మాణ విస్తీర్ణంపై ప్రభుత్వం కొత్త నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రూఫ్ లెవెల్ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు అక్టోబర్ 1 నుంచి తాజా ఆదేశాలు అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు.

750 చదరపు అడుగులకే పరిమితం

ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ నిర్మాణంలో 750 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణ పరిమితులను కచ్చితంగా పాటించాలని ఎంపీడీవో సింగారపు కుమార్ లబ్ధిదారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణ పనులు చేపట్టాలని తెలిపారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లయితే, దాని వల్ల కలిగే పరిణామాలకు సంబంధిత లబ్ధిదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎంపీడీవో స్పష్టం చేశారు.

జీపీ కార్యదర్శులకు పక్కా ఆదేశాలు

క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు సంబంధిత లబ్ధిదారులకు నిబంధనలను ముందుగానే వివరించాలని సూచించారు.

అక్టోబర్ 1, 2026 నుంచి ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ నిర్మాణం 750 చదరపు అడుగులకు మించకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించినట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ వెల్లడించారు.