భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా చేపడుతున్న సవరణలు, హియరింగ్స్, రీ-సర్వే ప్రక్రియపై తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులను, సంబంధిత సిబ్బందిని కలెక్టర్ అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఓటరు మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా మ్యాపింగ్, మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాలు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లాలో షెడ్యూల్ ప్రకారం కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబితాలో పేర్ల మ్యాపింగ్ కోసం ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి హియరింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల కమిషన్ సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపించి ఓటర్లు తమ పేర్లను మ్యాపింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికీ స్పందించని ఓటర్లను చైతన్యపరిచి, వారు తప్పనిసరిగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
భూ రీసర్వే పారదర్శకంగా చేపట్టాలి
జిల్లాలో భూ రీసర్వే కోసం 70 గ్రామాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఎంపికైన గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రభుత్వ భూములు, ఆబాది, పట్టా భూములను సర్వే చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, పక్కాగా నిర్వహించాలని సంబంధిత రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేకుండా నిబంధనలను పాటిస్తూ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో బండారి పార్థసారథి, ఎస్‌ఐఆర్ సిబ్బంది పాల్గొన్నారు.