భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

మృతుడి కుటుంబానికి ఎండీఆర్ ఫౌండేషన్ చేయూత

అనాధలకు అండగా నిలుస్తున్న ఎం డి ఆర్ ఫౌండేషన్

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు చింతలచెరువు వద్ద మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లాదుర్గం గ్రామానికి చెందిన మాణిక్యరావు మృతి చెందారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న మాణిక్యరావు మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన భార్య కూడా వికలాంగురాలు కావడంతో కుటుంబానికి మరింత కష్ట పరిస్థితులు ఎదురయ్యాయి.

అంత్యక్రియలకు ఆర్థిక ఇబ్బందులు

మాణిక్యరావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యుల వద్ద తగినంత ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎండీఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు వెంటనే స్పందించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని పటాన్‌చెరుకు తరలించి, కుటుంబ సభ్యుల సమక్షంలో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన సహాయాన్ని అందించారు.

కుటుంబానికి అండగా ఫౌండేషన్

ఆపద సమయంలో మాణిక్యరావు కుటుంబానికి అండగా నిలిచి, అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించిన ఎండీఆర్ ఫౌండేషన్ ప్రతినిధులను పలువురు అభినందించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి మానవతా దృక్పథంతో సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.