భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు చింతలచెరువు వద్ద మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లాదుర్గం గ్రామానికి చెందిన మాణిక్యరావు మృతి చెందారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న మాణిక్యరావు మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన భార్య కూడా వికలాంగురాలు కావడంతో కుటుంబానికి మరింత కష్ట పరిస్థితులు ఎదురయ్యాయి.
అంత్యక్రియలకు ఆర్థిక ఇబ్బందులు
మాణిక్యరావు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యుల వద్ద తగినంత ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎండీఆర్…






