భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

పటిష్ట భద్రతతో ప్రశాంతంగా గణపతి నిమజ్జనం

పటిష్ట భద్రతతో ప్రశాంతంగా గణపతి నిమజ్జనం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ టౌన్‌లో గణపతి నిమజ్జన కార్యక్రమాలు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించారు.

ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి

పటిష్ట భద్రతతో ప్రశాంతంగా గణపతి నిమజ్జనం

నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జన ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు విధుల్లో ఉన్న సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు అందించారు.

పోలీసు సిబ్బందికి అభినందనలు

గణపతి నిమజ్జన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో సమన్వయంతో పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ అభినందించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించిన పోలీసు సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు.