భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

మృతుడి కుటుంబానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఆర్థిక సాయం

మృతుడి కుటుంబానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఆర్థిక సాయం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణంలోని 1వ వార్డుకు చెందిన ఓద్ది రాజలింగం గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు శేట్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

కుటుంబానికి చేయూత

మృతుడి కుటుంబానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఆర్థిక సాయం

ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయంతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన చైర్‌పర్సన్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ భైరం కుమార్, మాజీ కౌన్సిలర్ బొర్ర అనిల్, భైరం శంకర్, అసది రాజు, భైరం రమేష్, గావు భాస్కర్, బొట్ల బాబు, ఓద్ది స్వామి, భైరం పెద్ద స్వామి, కుందెన రాములు, బొర్ర రమేష్, బొర్ర నర్సింలు, కుందెన అశోక్‌తో పాటు 1వ వార్డు సభ్యులు పాల్గొన్నారు.