భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణంలోని 1వ వార్డుకు చెందిన ఓద్ది రాజలింగం గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు శేట్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
కుటుంబానికి చేయూత
ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయంతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన చైర్‌పర్సన్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు…






