భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

బీజేవైఎం శివసాయి గౌడ్‌కు ఘన సన్మానం

బిజెవైఎం శివసాయి గౌడ్ కు ఘన సన్మానం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలానికి భారతీయ జనతా పార్టీ ఇటీవల బీజేవైఎం మండల అధ్యక్షుడిగా నైనాల గ్రామానికి చెందిన పెరుమాండ్ల శివసాయి గౌడ్‌ను నియమించింది. ఈ సందర్భంగా నెల్లికుదురులో శనివారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ శివసాయి గౌడ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలి

ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ యువతను పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుకుగా భాగస్వామ్యం చేస్తూ, మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు శివసాయి గౌడ్ కృషి చేయాలని ఆకాంక్షించారు. యువ మోర్చా ఆధ్వర్యంలో యువత సమస్యలపై చురుకుగా పనిచేస్తూ, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా

శివసాయి గౌడ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, యువతను పార్టీతో అనుసంధానం చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చందు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాస యాకిరెడ్డి, సురేష్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.