భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

నెల్లికుదురులో మోదీ పాలనపై బీజేపీ వ్యాసరచన పోటీలు

నెల్లికుదురులో.. మోడీ పాలన పై బిజెపి వ్యాసరచన పోటీలు..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బీజేపీ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. బీజేపీ మండల శాఖ అధ్యక్షులు చందు రాజకుమార్ ఆధ్వర్యంలో బాల, బాలికలకు ‘నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాపాలన’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

యువతకు స్ఫూర్తిదాయకం

ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్ హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రజా జీవితం, దేశ సేవ, అంకితభావం, అభివృద్ధి దృక్పథం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

నెల్లికుదురులో.. మోడీ పాలన పై బిజెపి వ్యాసరచన పోటీలు..

విజేతలకు బహుమతులు

అనంతరం వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి సింగారపు దీక్షిత్, ద్వితీయ బహుమతి సౌమ్య, తృతీయ బహుమతి ఉషకు మెమెంటోలు, బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు రాస యాకిరెడ్డి, బాదావతు సురేష్, మహమ్మద్ ముస్తఫా, తోట రేణుక, కుక్కల ఐలయ్య, బీజేవైఎం మండల అధ్యక్షుడు పెరుమాండ్ల శివ సాయి గౌడ్, తోట రమేష్, కొప్పు లక్ష్మణ్, తోట సురేష్, గుగులోత్ సోమన్న, నూనావత్ శ్రీను, శ్రీకాంత్, ప్రశాంత్, రాజశేఖర్, బింగి శంకర్, పాషా తదితరులు పాల్గొన్నారు.