భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని జీవన్ ధాన్ బ్లడ్ సెంటర్లో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 14 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
రక్తదానం మహత్తరమైన సేవ
ఈ సందర్భంగా బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర మీడియా కో-కన్వీనర్ కొండ సాయి ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నారని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసే ఉద్దేశంతో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
రక్తదానం మహత్తరమైన సామాజిక సేవ అని, అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు రక్తదాతలు అందించే సహాయం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింధె గంగా ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల రంజిత్, అప్పల రాకేష్, కార్యదర్శి స్వరాజ్, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు భీమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.