భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

వరి, పత్తి పంటలపై రైతులకు అవగాహన

వరి, పత్తి పంటలపై రైతులకు అవగాహన

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం, ఆలేరు గ్రామాల్లో వరి, పత్తి పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో నిర్వహించారు.

సస్యరక్షణ చర్యలపై అవగాహన

వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరి, పత్తి పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. పంటల సాగులో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు, పంటల సంరక్షణకు అవసరమైన చర్యలను వ్యవసాయ అధికారులు వివరించారు.

ఆధునిక సాగు పద్ధతుల వినియోగం

వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. ఆధునిక సాగు పద్ధతుల ద్వారా పంటల నిర్వహణను మెరుగుపరుచుకోవచ్చని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మణికంఠ, ధరణీశ్‌తో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.