భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం, ఆలేరు గ్రామాల్లో వరి, పత్తి పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో నిర్వహించారు.

సస్యరక్షణ చర్యలపై అవగాహన

వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరి, పత్తి పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించారు. పంటల సాగులో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు, పంటల సంరక్షణకు…