భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

భూ రీసర్వేలో రైతులు అధికారులకు సహకరించాలి

భూ రీసర్వేలో రైతులు అధికారులకు సహకరించాలి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భూముల రీ-సర్వేలో రైతులు సంబంధిత అధికారులకు తమ వివరాలన్నీ తెలియజేస్తూ సహకరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్ కర్షకులకు సూచించారు. నెల్లికుదురు మండలంలోని అలేరు గ్రామంలో స్థానిక సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం భూ రీ-సర్వే కార్యక్రమంపై గ్రామసభ, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

రీ-సర్వేపై రైతులకు అవగాహన

ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్, ఏడీఏస్ఆర్ఎల్ శ్రీనివాసులు, తహసీల్దార్ చంద నరేష్, డీఐ సురేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రీ-సర్వే ఉద్దేశ్యం, భూముల సర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, రికార్డుల నవీకరణ తదితర అంశాలపై రైతులకు, గ్రామ ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు.

భూ వివరాలను పరిశీలించుకోవాలి

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అనిల్ మాట్లాడుతూ.. రీ-సర్వే ప్రక్రియలో రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని, సర్వే సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు. భూ హక్కులు, భూ రికార్డులకు సంబంధించిన వివరాల విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, అధికారుల సూచనలను పాటిస్తూ రీ-సర్వే ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు.

కార్యక్రమంలో సర్వే సిబ్బంది, గ్రామ పరిపాలన అధికారులు, రైతులు పాల్గొన్నారు.