భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

ఐలమ్మ పోరాటం నేటి యువతకు ఆదర్శం

ఐలమ్మ పోరాటం నేటి యువతకు ఆదర్శం

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో చాకలి ఐలమ్మ యువజన సంఘం అధ్యక్షుడు పోరండ్ల సంపత్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.

భూమి కోసం.. భుక్తి కోసం ఐలమ్మ పోరాటం

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

అణగారిన వర్గాల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

ఘనంగా జయంతి వేడుకలు

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డా. ఆదూరి కలదర్ రాజు, వివిధ పార్టీల నాయకులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, బెల్లి నర్సయ్య, నల్లెడ యాకిరెడ్డి, మద్దెల రమేష్, డోనికని మల్లయ్య, నోముల రాజారాం, చాకలి ఐలమ్మ యువజన సంఘం సభ్యులు పోరండ్ల సోమయ్య, పోరండ్ల లక్ష్మయ్య, వెంకన్న, గణేష్, సతీష్, మడిపెద్ది చంద్రయ్య, ఎల్లయ్య, ముకేశ్, ఉప్పలయ్య, రవితేజ, బిక్షం, గుట్టయ్య, వెంకన్న, చింటూ తదితరులు పాల్గొన్నారు.