భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో చాకలి ఐలమ్మ యువజన సంఘం అధ్యక్షుడు పోరండ్ల సంపత్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించి ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు.

భూమి కోసం.. భుక్తి కోసం ఐలమ్మ పోరాటం

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం…