భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, సెప్టెంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

ఇనుగుర్తిలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి

ఇనుగుర్తిలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ తొలి సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలను మండల కేంద్రం ఇనుగుర్తిలో రజక సంఘం అధ్యక్షుడు కొలిపాక నారాయణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

భూమి కోసం.. భుక్తి కోసం పోరాటం

అనంతరం ఆహూతులైన వక్తలు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ ప్రజల విముక్తి కోసం భూస్వాములు, దొరలపై తిరుగుబాటు చేసిన గొప్ప పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఐలమ్మ ధైర్యం, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆమె ఆశయాలను స్మరించుకుంటూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు.

పలువురు నాయకుల హాజరు

కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ సట్ల మల్లయ్య, వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు బైరు అశోక్ గౌడ్, కూరెల్లి సతీష్, బండి సత్యం, కావటి నరసయ్య, ఓరిగంటి కిష్టయ్య, శంకరయ్య, వడ్డేపల్లి యాకయ్య, తీగల స్వామి, చినాలకట్టయ్య, మామిడి జనార్ధన్, కొట్టం మహేందర్, దేవులపల్లి చిన్న వెంకన్న, నరెడ్ల బిక్షపతి, పింగళి శ్రీనివాస్, బోళ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.