భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ తొలి సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలను మండల కేంద్రం ఇనుగుర్తిలో రజక సంఘం అధ్యక్షుడు కొలిపాక నారాయణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
భూమి కోసం.. భుక్తి కోసం పోరాటం
అనంతరం ఆహూతులైన వక్తలు మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ ప్రజల విముక్తి కోసం భూస్వాములు, దొరలపై…






