భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

చిన్ననాగారంలో 29న మెగా వైద్య శిబిరం

చిన్న నాగారంలో 29 న మెగా వైద్య శిబిరం.. జనరల్,గ్యాస్ట్రో,కంటి పరీక్షలు మెడిసిన్ ఫ్రీ..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో ఈనెల 29న (మంగళవారం) జంగాల రాజేశ్వర్రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సాయిరామ్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు స్థానిక సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరంలో ఖమ్మంకు చెందిన గుర్తింపు పొందిన వైద్యులు పాల్గొని వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్యాస్ట్రో, లివర్, ఉదరకోశ వ్యాధులతో పాటు కిడ్నీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రో, గ్యాస్ట్రో మెడిసిన్, ఆంకాలజీ, కార్డియాలజీ, డయాబెటిక్, సైనస్, ఆప్తమాలజీ, జనరల్ సర్జన్, డెర్మటాలజీ తదితర విభాగాలకు చెందిన వైద్యులు శిబిరంలో సేవలు అందించనున్నట్లు చెప్పారు.

ఉచిత పరీక్షలు.. మందుల పంపిణీ

శిబిరానికి వచ్చే రోగులకు వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు వారి ఆరోగ్య సమస్యలకు అవసరమైన వైద్య సలహాలు అందిస్తారని సర్పంచ్ తెలిపారు. పరీక్షల అనంతరం అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేయనున్నట్లు చెప్పారు. ఈ వైద్య శిబిరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రజారోగ్యాన్ని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ సుజాత యాకయ్య చేసిన అభ్యర్థన మేరకు జంగాల రాజేశ్వర్రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్, సాయిరామ్ హాస్పిటల్స్ సహకారంతో చిన్ననాగారంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ డైరెక్టర్ గెడ్డం సామ్యూల్ తెలిపారు.

గ్రామ ప్రజలతో పాటు గ్రామ పరిధిలోని తండాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అధిక సంఖ్యలో ప్రజలు శిబిరానికి హాజరై తమ ఆరోగ్య సమస్యలను వైద్యులతో పరీక్షలు చేయించుకుని, అవసరమైన ఉచిత మందులు పొందాలని పిలుపునిచ్చారు.