భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో ఈనెల 29న (మంగళవారం) జంగాల రాజేశ్వర్రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సాయిరామ్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు స్థానిక సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరంలో ఖమ్మంకు చెందిన గుర్తింపు పొందిన వైద్యులు పాల్గొని వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు…






