భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

జిన్నారం పూర్వ విద్యార్థుల సేవా స్ఫూర్తి

పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమాలు ఆదర్శనీయం

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎస్సీ 1999–2000 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చదువుకున్న పాఠశాలపై మమకారంతో పాటు తోటి విద్యార్థుల పట్ల బాధ్యతను చాటుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సమిష్టిగా ఏర్పడిన పూర్వ విద్యార్థులు తమ బ్యాచ్‌కు చెందిన తోటి విద్యార్థులందరికీ ఇన్సూరెన్స్ చేయించి అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం ‘ఫ్రెండ్స్ ఫరెవర్ లైఫ్ ఫర్ సొసైటీ’ అనే సేవా సంస్థను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి తమ వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమాలు ఆదర్శనీయం

సామాజిక బాధ్యతకు ప్రతీకగా..

తోటి విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం ద్వారా పూర్వ విద్యార్థులు తమ ఐక్యతను చాటుకుంటున్నారు. సేవా కార్యక్రమాల ద్వారా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ, ఇతరులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రాఘవేందర్ రెడ్డి, నవీన్, ప్రవీణ్ కుమార్, బ్రహ్మేంద్ర గౌడ్, మహేష్, నందు, నర్సింగ్ రావు, మమత, శ్వేత, మమత తదితరులు పాల్గొన్నారు.