భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎస్సీ 1999–2000 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చదువుకున్న పాఠశాలపై మమకారంతో పాటు తోటి విద్యార్థుల పట్ల బాధ్యతను చాటుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సమిష్టిగా ఏర్పడిన పూర్వ విద్యార్థులు తమ బ్యాచ్‌కు చెందిన తోటి విద్యార్థులందరికీ ఇన్సూరెన్స్ చేయించి అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం ‘ఫ్రెండ్స్ ఫరెవర్ లైఫ్ ఫర్ సొసైటీ’ అనే సేవా సంస్థను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు…






