భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి

తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి.. ఆవిర్భావ వేడుకకు తరలిన నెల్లికుదురు ఉద్యమకారులు.. భారత్ సమాచ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రకటించిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ ఆవిర్భావ వేడుకలకు హాజరయ్యేందుకు మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి నెల్లికుదురు మండలానికి చెందిన ఉద్యమకారులు ఆదివారం యాదగిరిగుట్టకు తరలివెళ్లారు.

ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్మరికుంట్ల మౌనేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు వీరగాని మల్లేశం గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్, కదిర జగన్ గౌడ్, అవిరేండ్ల రామచంద్రు యాదవ్, హెచ్.అశోక్ సంయుక్తంగా మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఉద్యమంలో ఎన్నో పోరాటాలు

తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు గ్రామాల్లో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు, కూలి పని, కొవ్వొత్తుల ప్రజ్వలన, ధూమ్‌ధామ్, సకల జనుల సమ్మె, చలో అసెంబ్లీ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు తమ వంతు పాత్ర పోషించారని తెలిపారు. నెల్లికుదురు మండల కేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని సైతం నిర్మించినట్లు చెప్పారు.

హామీలు అమలు చేయాలని డిమాండ్

నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన మలిదశ ఉద్యమ నాయకులను ప్రభుత్వం గుర్తించాలని, వారికి ప్రకటించిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ వేడుకలో పాల్గొనడంతో పాటు ఉద్యమకారుల హక్కుల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణపై తగిన వ్యూహరచన చేసేందుకు నెల్లికుదురు మండల కేంద్రం నుంచి చలో యాదగిరిగుట్ట కార్యక్రమానికి తరలివెళ్లినట్లు వారు తెలిపారు.