భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఏఐసీసీ పిలుపులో భాగంగా సోమవారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయడానికి పెద్ద సంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళీనాయక్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ర్యాలీతో పాటు దిష్టిబొమ్మ దహన కార్యక్రమం కూడా ఉంటుందని పేర్కొన్నారు.
పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
కాంగ్రెస్ పార్టీ మండల, జిల్లా నాయకులు, గ్రామ సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదవ రెడ్డి కోరారు.
తెలంగాణలో సెప్టెంబర్ 28న అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.