భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, సెప్టెంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

రాజకీయ కక్షలు మనకెందుకు..? : ఉద్యమ నేత రజినీకాంత్

రాజకీయ కక్షలు మనకెందుకు..? : ఉద్యమ నేత రజినీకాంత్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత బూర రజినీకాంత్ రాజకీయ కక్షలకు తావివ్వకుండా అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీలు మారినంత మాత్రాన మనుషుల మధ్య సంబంధాలు, ఆత్మీయతలు మారకూడదని పేర్కొంటూ అక్షర కూర్పు ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఒకప్పుడు ఒక జెండా పట్టిన చేయి.. నేడు మరో జెండా పట్టిందని ఆ వ్యక్తి మారిపోయినట్లు భావించకూడదని, కేవలం అతని రాజకీయ నిర్ణయం మారిందని అర్థం చేసుకోవాలని రజినీకాంత్ పేర్కొన్నారు. రాజకీయాల్లో మార్పు సహజమని, నాయకుల రాజకీయ ప్రయాణంలో మలుపులు రావడం సహజమేనని అన్నారు. అయితే ఆ మార్పును చూసి కక్షలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మన సంస్కృతి కాదని తెలిపారు.

జెండాలు వేరైనా.. మన ఊరు ఒక్కటే

జెండాలు వేరైనా ఊరు ఒక్కటేనని, పార్టీలు వేరైనా మనుషులంతా మనవాళ్లేనని రజినీకాంత్ పేర్కొన్నారు. నిన్న కలిసి నడిచిన వారిని ఈరోజు రాజకీయ అభిప్రాయం మారిందనే కారణంతో శత్రువులుగా చూడవద్దని సూచించారు. రాజకీయ అభిప్రాయాలు మారవచ్చని, కానీ మనిషిపై ద్వేషం పెంచుకోవద్దని అన్నారు.

ప్రజల కోసం రాజకీయాలు ఉండాలని, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు రాజకీయాలను ఉపయోగించకూడదని పేర్కొన్నారు. గెలుపు కోసం రాజకీయ పోటీ ఉండొచ్చని, కానీ గుండెల్లో కక్షలు ఉండకూడదని హితవు పలికారు.

జెండా మారితే రాజకీయ అభిప్రాయం మారవచ్చని, కానీ మనిషిపై గౌరవం మాత్రం మారకూడదని రజినీకాంత్ అన్నారు. పార్టీలు మారవచ్చని, అయితే మన ఊరి బంధాలు మారకూడదని పేర్కొన్నారు. ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి.. ఇదే మన ఊరి గొప్పతనం అని తన అక్షర కూర్పు ద్వారా సందేశాన్ని ఇచ్చారు.