భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత బూర రజినీకాంత్ రాజకీయ కక్షలకు తావివ్వకుండా అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీలు మారినంత మాత్రాన మనుషుల మధ్య సంబంధాలు, ఆత్మీయతలు మారకూడదని పేర్కొంటూ అక్షర కూర్పు ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఒకప్పుడు ఒక జెండా పట్టిన చేయి.. నేడు మరో జెండా పట్టిందని ఆ వ్యక్తి మారిపోయినట్లు భావించకూడదని, కేవలం అతని రాజకీయ నిర్ణయం మారిందని అర్థం చేసుకోవాలని రజినీకాంత్ పేర్కొన్నారు. రాజకీయాల్లో మార్పు…