భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

రాజు కన్నుమూత బీఆర్ఎస్‌కు తీరని లోటు: మాజీ ఎమ్మెల్యే

రాజు కన్నుమూత బిఆర్ ఎస్ కు తీరని లోటు                      మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బానోతు రాజు ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మండలంలోని సంధ్య తండాకు చెందిన రాజు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న శంకర్ నాయక్ సోమవారం స్థానిక సర్పంచ్ బోడ నర్సింహ నాయక్ తదితర నాయకులతో కలిసి ఆయన పార్థివదేహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ బానోతు రాజు బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి చురుగ్గా పనిచేశారని గుర్తుచేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంగా ఉంటూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేశారని తెలిపారు. రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజు సేవలను పార్టీ నాయకులు, కార్యకర్తలు స్మరించుకుంటారని పేర్కొన్నారు.

రాజు కన్నుమూత బిఆర్ ఎస్ కు తీరని లోటు                      మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్

అనంతరం స్వర్గీయ రాజు అంతిమయాత్రలో స్థానిక సర్పంచ్ బోడ నర్సింహ నాయక్ పాల్గొన్నారు. రాజు పాడెను మోసి అంతిమయాత్రలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింహ నాయక్ మాట్లాడుతూ రాజు ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీలో చురుకైన నాయకుడిగా ఉంటూ పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి చేశారని తెలిపారు. గ్రామంలోని ప్రజలతో కలివిడిగా ఉంటూ అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారని, గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందించేవారని గుర్తుచేశారు.

రాజు మృతి పట్ల గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట నాయకులు శ్రీను, సోములు, కాసిమ్, అనిల్, నవీన్, స్వామి, యువజన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజు సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.