భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు పట్టణంలో శరత్ మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురు పాల్గొని వైద్యులచే కంటి పరీక్షలు చేయించుకున్నారు. తమకు ఉన్న కంటి సమస్యలను తెలుసుకొని, అవసరమైన వైద్య సలహాలను పొందారు.
ఈ కార్యక్రమాన్ని తొర్రూరు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షులు ఇట్టే సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని, కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఓన్లీ విశ్వనాథ చారి, చెన్నోజు విజయ్ కుమార్, కార్యదర్శి కమలాకర్ స్వామి, మన్నూరు ఎల్లప్పతో పాటు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. శిబిరానికి హాజరైన పేషెంట్లు ఉచిత కంటి పరీక్షల ద్వారా తమ సమస్యలను తెలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
పేద ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేలా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను భవిష్యత్తులో కూడా మరెన్నో నిర్వహించాలని వారు కోరారు.