భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు పట్టణంలో శరత్ మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురు పాల్గొని వైద్యులచే కంటి పరీక్షలు చేయించుకున్నారు. తమకు ఉన్న కంటి సమస్యలను తెలుసుకొని, అవసరమైన వైద్య సలహాలను పొందారు.

ఈ కార్యక్రమాన్ని తొర్రూరు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షులు ఇట్టే సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని, కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు…