భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం రాము తండా గిరిజనుల కోసం మినరల్ వాటర్ అందించేందుకు బీఆర్‌ఎస్ పార్లమెంటరీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర వాటర్ క్యాన్లను వితరణ చేశారు. సుమారు రూ.1 లక్ష విలువ చేసే 300 వాటర్ క్యాన్లను మాజీ సర్పంచ్ బానోతు రామన్న ఆధ్వర్యంలో మంగళవారం తండావాసులకు పంపిణీ చేశారు.
ఈ వాటర్ క్యాన్లను ఇనుగుర్తి ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దీకొండ వెంకన్న గౌడ్ చేతుల మీదుగా తండావాసులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంపీ రవిచంద్ర, ఆయన సోదరులైన వద్దిరాజు కుటుంబ సభ్యులు ఈ ప్రాంత అభివృద్ధికి అనేక విధాలుగా సహకరిస్తున్నారని తెలిపారు. ఎన్నో గ్రామాలకు వివిధ రూపాల్లో చేయూత అందిస్తున్న క్రమంలో రాము తండా గిరిజనుల కోసం వాటర్ క్యాన్లను అందించడం అభినందనీయమన్నారు.
తండావాసుల అవసరాన్ని గుర్తించి మినరల్ వాటర్ కోసం 300 క్యాన్లను అందజేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహకారం గిరిజన కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ ధరావత్ వీరు, లకావత్ కోకియా, జరుపుల దేవేందర్, జరుపుల హుస్సేన్, జరుపుల మోతిలాల్, బాలవికాస కమిటీ చైర్మన్ వెంకన్న, ఆపరేటర్ బానోతు రాజు, తండా నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.