భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

రామానుజాపురంలో కరెంటు కట్

రామానుజాపురంలో కరెంటు సరఫరాకు అంతరాయం..                                           విద్యుత్ ఏఈ సింధు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని రామానుజాపురం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు బుధవారం (సెప్టెంబర్ 30న) కరెంటు సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు నెల్లికుదురు విద్యుత్ ఏఈ సింధు తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

మరమ్మతు పనుల కారణంగా నిలిపివేత

రామానుజాపురం సబ్‌స్టేషన్‌లో సోలార్ విద్యుత్‌ను అనుసంధానం చేసే పనులతో పాటు అవసరమైన మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు ఏఈ సింధు తెలిపారు. ఈ పనుల కారణంగా బుధవారం సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.

విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి, ముందుగానే తమ పనులను పూర్తి చేసుకోవాలని ఏఈ సింధు సూచించారు. మరమ్మతు పనులకు సహకరించాలని కోరారు.