భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

తుదిదశకు చేరిన చేయూత పెన్షన్ల సర్వే

తుదిదశకు చేరిన చేయూత పెన్షన్ల సర్వే

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలో చేయూత కొత్త పెన్షన్ల దరఖాస్తుల వెరిఫికేషన్ సర్వే తుది దశకు చేరుకున్నట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

843 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి

మండలంలోని 31 గ్రామ పంచాయతీల నుంచి వివిధ రకాల చేయూత పెన్షన్ల కోసం మొత్తం 853 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో తెలిపారు. వీటిలో మంగళవారం సాయంత్రం నాటికి 843 దరఖాస్తుల వెరిఫికేషన్ సర్వే పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.

మరో 10 దరఖాస్తుల పరిశీలన

ఇంకా 10 దరఖాస్తుల వెరిఫికేషన్ సర్వే చేయాల్సి ఉందని ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు. మిగిలిన దరఖాస్తులపై కూడా త్వరలోనే వెరిఫికేషన్ సర్వే పూర్తి చేయిస్తామని ఆయన వెల్లడించారు.