భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

యువత సమాజ సేవలో ముందుండాలి: కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

యువత సమాజ సేవలో ముందుండాలి: కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: యువత ఐక్యతగా ఉంటూ సమాజ సేవలో ముందుండాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన హైందవ సేవా సమితి యువకులు సుమారు 50 మంది బుధవారం కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్‌గౌడ్, మాజీ వైస్‌ఎంపీపీ సత్యనారాయణగౌడ్, మాజీ ఎంపీటీసీ యాదగిరి, యువ నాయకుడు స్వామి ఆధ్వర్యంలో హైందవ సేవా సమితి యువకులు ఆయనను కలిశారు.

సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలి

యువత సమాజ సేవలో ముందుండాలి: కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

ఈ సందర్భంగా కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ హైందవ సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో యువత చురుగ్గా పాల్గొనాలని అన్నారు. యువత ఐక్యతగా ఉంటూ ప్రజలకు అండగా నిలవాలని పేర్కొన్నారు.

ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాల నిర్వహణకు తనవంతు సహకారం అందిస్తానని కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తెలిపారు. సమాజ సేవలో యువత భాగస్వామ్యం మరింత పెరగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హైందవ సేవా సమితి యువకులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.