భారత్ సమాచార్, మెదక్ జిల్లా: యువత ఐక్యతగా ఉంటూ సమాజ సేవలో ముందుండాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన హైందవ సేవా సమితి యువకులు సుమారు 50 మంది బుధవారం కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్‌గౌడ్, మాజీ వైస్‌ఎంపీపీ సత్యనారాయణగౌడ్, మాజీ ఎంపీటీసీ యాదగిరి, యువ నాయకుడు స్వామి ఆధ్వర్యంలో హైందవ సేవా సమితి యువకులు ఆయనను కలిశారు.






