భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: టీయూడబ్ల్యూజే-143 నెల్లికుదురు మండల కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని నెల్లికుదురు విద్యాసంస్థల సముదాయ ఆవరణంలో టీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య, కోఆర్డినేటర్ గాడిపెల్లి శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు జంపాల చక్రధర్ పర్యవేక్షణలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
నూతన కమిటీ ఎంపిక
టీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడిగా ‘మన తెలంగాణ’ దినపత్రికకు చెందిన మద్ది వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా ‘సాక్షి’ విలేకరి బైరు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ‘ఆంధ్రజ్యోతి’ కంట్రిబ్యూటర్ మల్యాల నరసయ్యను ఎన్నుకున్నారు.
సహాయ కార్యదర్శిగా ‘నమస్తే తెలంగాణ’ జర్నలిస్టు మస్కపురి సుధాకర్, కోశాధికారిగా జెల్ల ఉపేందర్‌ను ఎంపిక చేశారు. కార్యవర్గ సభ్యులుగా ‘ప్రజా జ్యోతి’ రిపోర్టర్ పోరండ్ల లక్ష్మయ్య, ‘బహుజన టీవీ’ విలేకరి జిలకర శ్రీధర్‌ను ఎన్నుకున్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా నియామకానికి సహకరించిన జిల్లా నాయకులు మద్దినేని గుట్టయ్య, గాడిపెల్లి శేఖర్, జంపాల చక్రధర్‌తో పాటు మండల విలేకరులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తానని అన్నారు.