భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: టీయూడబ్ల్యూజే-143 నెల్లికుదురు మండల కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని నెల్లికుదురు విద్యాసంస్థల సముదాయ ఆవరణంలో టీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య, కోఆర్డినేటర్ గాడిపెల్లి శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు జంపాల చక్రధర్ పర్యవేక్షణలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

నూతన కమిటీ ఎంపిక

టీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడిగా ‘మన తెలంగాణ’ దినపత్రికకు చెందిన మద్ది వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా ‘సాక్షి’ విలేకరి బైరు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ‘ఆంధ్రజ్యోతి’ కంట్రిబ్యూటర్ మల్యాల నరసయ్యను ఎన్నుకున్నారు.

…