భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు మల్ల చెరువు కట్టను మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ పరిశీలించారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలకు సౌకర్యాలు కల్పించడంతో పాటు రహదారి, విద్యుత్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేయాలి
మల్ల చెరువు కట్ట వద్ద విద్యుత్ సిబ్బందితో మాట్లాడి బతుకమ్మ వేడుకల సమయంలో మహిళలకు ఇబ్బందులు లేకుండా తగిన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి వేళల్లో కూడా కట్ట పరిసరాలు వెలుగులు ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
రోడ్డు పనులు వేగవంతం చేయాలి
అదేవిధంగా మల్ల చెరువు కట్ట రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేసి బతుకమ్మ పండుగకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. పండుగ సందర్భంగా ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కోఆప్షన్ సభ్యురాలు చింతల రాధా భవాని యాదగిరి, పట్టణ అధ్యక్షుడు చింతల సప్న స్వామి, మాజీ కౌన్సిలర్ బుర్ర అనిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టి యాదగిరి, యూత్ కాంగ్రెస్ నాయకులు చిలుక విరాట్, భాను ప్రసాద్, దేవుని నరేష్, నరేందర్, సాయి తేజ, సుధీర్ గౌడ్, గణేష్‌తో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు.