భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు మల్ల చెరువు కట్టను మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజ్ పరిశీలించారు. బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలకు సౌకర్యాలు కల్పించడంతో పాటు రహదారి, విద్యుత్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేయాలి
మల్ల చెరువు కట్ట వద్ద విద్యుత్ సిబ్బందితో మాట్లాడి బతుకమ్మ వేడుకల సమయంలో మహిళలకు…






