భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామానికి చెందిన గొర్రెలు ప్రమాదవశాత్తు లక్ష్మాపూర్ రైల్వే ట్రాక్ వద్ద మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబాలను మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ ఘటనలో సుమారు 40 గొర్రెలు మృతి చెందడంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి.
తొనిగండ్లకు చెందిన కోకట్ల యాదయ్య, బీరయ్యలకు చెందిన గొర్రెలు మృతి చెందిన విషయం తెలుసుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి వారి కుటుంబ సభ్యులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
బాధిత కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబాలకు అండగా నిలుస్తామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రం, మండల యువజన అధ్యక్షుడు రాగి ఉమామహేశ్వర్, తొనిగండ్ల భూమలింగం, సిద్ధారములు, లక్ష్మాపూర్ మల్లేశం, బీఆర్‌ఎస్ నాయకులు శ్రీకాంత్ సాగర్, శ్రవణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.