భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామానికి చెందిన గొర్రెలు ప్రమాదవశాత్తు లక్ష్మాపూర్ రైల్వే ట్రాక్ వద్ద మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబాలను మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ ఘటనలో సుమారు 40 గొర్రెలు మృతి చెందడంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి.
తొనిగండ్లకు చెందిన కోకట్ల యాదయ్య, బీరయ్యలకు చెందిన గొర్రెలు మృతి చెందిన విషయం తెలుసుకున్న పద్మాదేవేందర్‌రెడ్డి వారి కుటుంబ సభ్యులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ…






