భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా సైన్స్ ఫెయిర్

వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా సైన్స్ ఫెయిర్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్‌లో కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి బాలబాలికలు రూపొందించిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేశాయి. విద్యార్థులు సుమారు వందకు పైగా ఎగ్జిబిట్లను రూపొందించి ప్రదర్శించడంతో పాటు వాటి పనితీరును సవివరంగా వివరించారు.

సృజనాత్మకత వికసిస్తుంది: ఎస్సై నరేష్

వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్‌లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్‌కు స్థానిక ఎస్సై పి. నరేష్ హాజరై కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను ఆసక్తిగా పరిశీలించారు. ఆయా ప్రదర్శనల గురించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకుంటూ వారితో ముచ్చటించారు. విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా సైన్స్ ఫెయిర్

ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్‌ల ద్వారా విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై అవగాహన పెరగడంతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకత వికసిస్తుందని అన్నారు. విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా సైన్స్ ఫెయిర్ నిర్వహించడం పట్ల పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.

విద్యార్థులను అభినందించిన సర్పంచ్

స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ సైన్స్ ఫెయిర్‌ను సందర్శించి విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను ఆసాంతం పరిశీలించారు. చిన్న వయసులోనే శాస్త్రీయ దృక్పథంతో వివిధ ఎగ్జిబిట్లను రూపొందించి ప్రదర్శించిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఎదిగి శాస్త్రవేత్తలుగా రాణించాలని ఆకాంక్షించారు.

వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో ఘనంగా సైన్స్ ఫెయిర్

నూతన ఆవిష్కరణలకు వేదిక: కరస్పాండెంట్

సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో నూతన ఆలోచనలకు, భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలకు వేదికగా ఉపయోగపడుతుందని పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ అన్నారు. విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లలో పర్యావరణం, ఆరోగ్యం, విద్య, వైద్యం, అతివృష్టి, అనావృష్టి, ఎల్‌నినో వంటి అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించే ప్రదర్శనలు ఉన్నాయని పేర్కొంటూ విద్యార్థులను ప్రశంసించారు.

అనంతరం సైన్స్ ఫెయిర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీకాంత్, ఏఎంసీ డైరెక్టర్ రాము, పేరెంట్స్ కమిటీ సభ్యులు కవిత, మానస, మాధవి, సబియా బేగం, రఘు, రామ్ సలీం, ఉపాధ్యాయ బృందం శిరీష, అప్సర, నవ్య, షా ఇన్, శ్రీలత, స్రవంతితో పాటు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.