భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేవలకు దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తులకు ఆహ్వానం  మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఖరీఫ్ 2026–27 ధాన్యం కొనుగోలు సీజన్ సందర్భంగా జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (పీపీసీలు) సన్న రకం ధాన్యాన్ని గుర్తించి, ధృవీకరించేందుకు అర్హత కలిగిన వ్యక్తుల సేవలను రెండు నెలల కాలానికి వినియోగించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హత కలిగిన అభ్యర్థులకు అవకాశం

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం ధాన్యాన్ని గుర్తించి, ధృవీకరించే బాధ్యతల కోసం బీఎస్సీ అగ్రికల్చర్, అగ్రికల్చర్‌లో డిప్లొమా, డిప్లొమా ఇన్ డ్రైలాండ్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, బీఎస్సీ బాటనీ, బీజెడ్‌సీ వంటి విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య, అభ్యర్థుల అర్హతలను పరిగణనలోకి తీసుకుని అర్హత కలిగిన వ్యక్తుల సేవలను ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయి కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.

విద్యార్హతలు, అనుభవ వివరాలతో సంప్రదించాలి

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవ వివరాలతో మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.