భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

మళ్లీ అదే చోట పైప్ లీకేజీ.. పెద్ద శబ్దంతో స్థానికుల్లో ఆందోళన

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మిషన్ భగీరథ పైప్ లీకేజీ..

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం ముందు పైప్ నుంచి భారీగా నీరు లీకై రోడ్డుపైకి ప్రవహిస్తోంది. ఇప్పటికే ఇదే ప్రాంతంలో రెండోసారి పైప్ లీకేజీ చోటుచేసుకోవడంతో రహదారిపై పెద్దఎత్తున నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విద్యుత్ స్తంభాల వైపు చేరిన నీరు

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మిషన్ భగీరథ పైప్ లీకేజీ..

పైప్ నుంచి వెలువడుతున్న నీరు రహదారిపై ప్రవహిస్తూ విద్యుత్ స్తంభాల వైపు కూడా చేరిన పరిస్థితి నెలకొంది. నీరు కరెంట్ స్తంభాల వద్దకు చేరడంతో పెద్ద శబ్దం రావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వెంటనే లీకేజీ అరికట్టాలని డిమాండ్

ఇదే ప్రాంతంలో తరచూ పైప్ లీకేజీ సమస్య తలెత్తుతుండటంతో అధికారులు తాత్కాలిక చర్యలకు పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుపై నీటి ప్రవాహాన్ని వెంటనే అరికట్టి, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.