భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

చిన్ననాగారంలో సారకోల్ల గౌడ్‌గా వెంకటేశ్వర్లు గౌడ్ ఎన్నిక

చిన్ననాగారంలో సారకోల్ల గౌడ్‌గా వెంకటేశ్వర్లు గౌడ్ ఎన్నిక

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన గౌడ సామాజిక వర్గానికి నూతన సారకోల్ల గౌడ్‌గా బైరు వెంకటేశ్వర్లు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో గ్రామంలోని గౌడ కులస్తులు బుధవారం సమావేశమై ఈ మేరకు వెంకటేశ్వర్లు గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

హక్కులు, సమస్యల పరిష్కారానికి కృషి

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సారకోల్ల గౌడ్ బైరు వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన హక్కులు, సమస్యల పరిష్కారం కోసం అందరి సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో సారకోల్ల గౌడ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న గౌడ కులస్తులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన గౌడ కులస్తులు పాల్గొన్నారు.