భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సెప్టెంబర్ 5న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులను పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ఇనుగుర్తి మండలంలోని ఇనుగుర్తి హైస్కూల్ హెచ్ఎం అమ్మ యాకయ్య, లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కుందె చైతన్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న సందర్భంగా వారిని సత్కరించారు.
జిల్లా పురస్కారాలు అభినందనీయం: ఎంఈఓ
స్థానిక ఎంఈఓ వెన్న వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించడంతో పాటు ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.
ఇనుగుర్తి మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై పురస్కారాలు అందుకోవడం అభినందనీయమని అన్నారు. ఉపాధ్యాయులు తమ సేవల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ సమాజ నిర్మాతలుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పీఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు సూరం భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరన్నతో పాటు వివిధ పాఠశాలల హెచ్ఎంలు శరత్, రవీందర్, రమేష్, కోటేశ్వర్, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు.