భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, సెప్టెంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

సర్పంచులు, అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్

సర్పంచులు, అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై మంత్రి అవగాహన కల్పించారు.

గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వీబీ-జీ రామ్-జీ పేరుతో అమలు చేస్తున్న ఉపాధి పథకంలో గ్రామసభల ద్వారా అవసరమైన పనులను గుర్తించాలని మంత్రి సీతక్క సూచించారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, ఫారం పాండ్లు, రైతులకు చెందిన పొలాలకు సంబంధించిన పనులు, చేలుకలు, పొలాల వద్దకు వెళ్లే దారుల మరమ్మతులు వంటి పనులను గుర్తించి చేపట్టాలని తెలిపారు.

గ్రామాల అవసరాలకు అనుగుణంగా పనులను ఎంపిక చేసి ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీడీవో కుమార్, ఎంపీవో హిజ్మతుల్లా, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వీబీ-జీ రామ్-జీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.