భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

హిందువులను విభజించి మాట్లాడటం సరికాదు: రాజిరెడ్డి

రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకపోతే తిరుగుబాటె

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎండోమెంట్ సెల్ మెదక్ జిల్లా జాయింట్ కన్వీనర్ హనుమాన్ సేన రాజిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివుడికి పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తమ నిరసనను వ్యక్తం చేశారు.

అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి హిందువులను శివ భక్తులు, రామ భక్తులుగా వేరుచేసి మాట్లాడటం హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. ఉత్తర భారతదేశంలో అనేక శివాలయాలు ఉన్నాయని, దక్షిణ భారతదేశంలో ప్రతి గ్రామంలో హనుమంతుడు, రాముడి ఆలయాలు ఉన్నాయని తెలిపారు.

హిందువులను దేవుళ్ల పేరుతో విభజించి మాట్లాడటం సరైన పద్ధతి కాదని రాజిరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన తీరు మార్చుకోకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. శివుడు రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎండోమెంట్ సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్ కృష్ణ, నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్, బీజేపీ నర్సాపూర్ పట్టణ కన్వీనర్ ప్రేమ్ కుమార్, ఎండోమెంట్ సెల్ నర్సాపూర్ మండల జాయింట్ కన్వీనర్ వేణు, ఎండోమెంట్ సెల్ 9వ వార్డు కన్వీనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.