భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎండోమెంట్ సెల్ మెదక్ జిల్లా జాయింట్ కన్వీనర్ హనుమాన్ సేన రాజిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివుడికి పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తమ నిరసనను వ్యక్తం చేశారు.
అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి హిందువులను శివ భక్తులు, రామ భక్తులుగా వేరుచేసి మాట్లాడటం హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని ఆరోపించారు. ఉత్తర భారతదేశంలో…






