భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

మేదక్ అభివృద్ధికి కొత్త దిశ.. ప్రజల కలలను సాకారం

మేదక్ అభివృద్ధికి కొత్త దిశ.. ప్రజల కలలను సాకారం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ పట్టణ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా పనులను ముందుకు తీసుకెళ్తామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్న మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని ప్రతి ప్రాంతంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ప్రతి రోడ్డులో అభివృద్ధి కనిపించాలి

“మెదక్ ప్రజలు అభివృద్ధి అంటే ఏమిటో కళ్లారా చూడాలి. అభివృద్ధి కాగితాలపై ఉండకూడదు.. అది రోడ్లపై కనిపించాలి, డ్రైనేజీ వ్యవస్థలో కనిపించాలి, ప్రధాన కూడళ్ల రూపంలో కనిపించాలి. ప్రజలకు అందుతున్న మౌలిక వసతుల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపించాలి. అదే మా లక్ష్యం” అని రోహిత్ రావు అన్నారు.

మెదక్ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ప్రధాన కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణతో పాటు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మేజర్ ధ్యాన్‌చంద్ వంటి మహనీయుల స్ఫూర్తిని భావితరాలకు అందించేలా ఈ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు.

మేదక్ అభివృద్ధికి కొత్త దిశ.. ప్రజల కలలను సాకారం

మహనీయుల స్ఫూర్తి భావితరాలకు అందాలి

“విగ్రహాలు ఏర్పాటు చేయడం మాత్రమే మా ఉద్దేశం కాదు. ఆయా మహనీయుల ఆలోచనలు, సేవలు, త్యాగాలు, స్ఫూర్తి ప్రజలకు, భావితరాలకు గుర్తుండేలా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే మా ఆలోచన” అని ఎమ్మెల్యే తెలిపారు.

మెదక్ పట్టణంతో పాటు రామాయంపేట ప్రాంత అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. పట్టణాల్లో రహదారులు, డ్రైనేజీ, జంక్షన్లు, సుందరీకరణ, ఇతర మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తమ బాధ్యత అని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఒక్కో సమస్యకు పరిష్కారం చూపుతూ మెదక్ పట్టణాన్ని ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని, మెదక్ అభివృద్ధి ప్రయాణం ఆగదని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు.