భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ పట్టణ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలు కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా పనులను ముందుకు తీసుకెళ్తామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఏళ్లుగా ప్రజలు కోరుకుంటున్న మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, ప్రధాన కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని ప్రతి ప్రాంతంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను…